అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జగన్ ప్రయత్నం

జగన్‌ ప్రభుత్వం ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవాస్తవాలను...

Published : 03 Jan 2020 15:06 IST

తెదేపా ఎంపీ కనకమేడల

దిల్లీ: జగన్‌ ప్రభుత్వం ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ విమర్శించారు. పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవాస్తవాలను పదేపదే చెప్పి వాస్తవాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపా ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. తెదేపా నేతలెవరూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదు. వైకాపా నేతలు వాస్తవాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు’’ అని కనకమేడల విమర్శించారు. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై గురువారం వైకాపా నేతలు ఇచ్చిన ప్రజెంటేషన్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కనకమేడల చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఏ రైతు అయినా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ప్రజల ముందు వాస్తవాలను బయటపెట్టడానికి వైకాపా నేతలు ఎందుకు జంకుతున్నారని అన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై విమర్శలు చేయడం దారుణమన్నారు.

రాజధాని ప్రకటనకు ముందు దొనకొండ వద్ద భూ లావాదేవీలను బయటపెట్టాలని కనకమేడల డిమాండ్‌ చేశారు. విశాఖ, భీమిలిలో గత 6 నెలల్లో జరిగిన లావాదేవాలను ప్రకటించాలన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసం క్విడ్‌ ప్రోకో ద్వారానే ఏర్పాటైందని, రాజధాని  మార్పుపై కోర్టు కెళ్తే.. రూ లక్షల కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వ విధానాన్ని నివేదిక రూపంలో ఇవ్వడానికి కమిటీలు వేయడం ఎందుకని కనకమేడల నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని