‘కేంద్ర నిధులపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు’

కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు పచ్చి అబద్ధాలు చెప్పారని.. ఆ విషయం లోక్‌సభ సాక్షిగా బహిర్గతం అయిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఈ ఆరేళ్లలో వివిధ పథకాలకు...

Published : 11 Feb 2020 00:45 IST

భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శలు

దిల్లీ: కేంద్రం నిధులపై సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు పచ్చి అబద్ధాలు చెప్పారని.. ఆ విషయం లోక్‌సభ సాక్షిగా బహిర్గతం అయిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఈ ఆరేళ్లలో వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.52లక్షల కోట్ల నిధులు తెలంగాణకు ఇచ్చిందని చెప్పారు. తెలంగాణకు ఈ ఆరేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లోక్‌సభలో ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అర్వింద్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని చెప్పే సీఎం.. ఈ ప్రకటనతో సిగ్గు పడాలన్నారు. కేంద్రం ఏటా రాష్ట్రానికి రూ.50వేల కోట్లు ఇస్తోందన్నారు. మహిళలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు అని చెప్పి కేసీఆర్ మోసం చేశారని అర్వింద్‌ ఆరోపించారు. జాతీయ మీడియా కథనం ప్రకారం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.70వేల కోట్ల రుణం తీసుకున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని.. 
కేంద్రం ఇచ్చే నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని