3రాజధానులపై కేంద్రంకు చెప్పారా? ఆధారాలేవీ?

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిన వైకాపా రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ర్యాలీలు ఎలా చేస్తుందని భాజపా

Updated : 15 Feb 2020 15:51 IST

వైకాపాకు భాజపా నేత సునీల్‌ దేవధర్‌  ప్రశ్న

విశాఖ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిన వైకాపా రాష్ట్రంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ర్యాలీలు ఎలా చేస్తుందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ ప్రశ్నించారు. దీనికి వైకాపా నేతలు సమాధానం చెప్పాలన్నారు. శనివారం విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఉత్తరాంధ్ర నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయడంలేదని వైకాపా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు. వైకాపా నేతలు కేంద్రానికి చెప్పే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని అంటున్నారనీ.. అదే నిజమైతే లిఖితపూర్వక ఆధారాలు చూపాలన్నారు. ఇసుక విధానంతో పాటు అనేక విషయాల్లో వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని