అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నారు:దేవినేని

 రాష్ట్రంలో పరిపాలన అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో

Published : 27 Feb 2020 17:23 IST

గుంటూరు: రాష్ట్రంలో పరిపాలన అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా చేపట్టిన రాస్తారోకోను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నేతలు దేవినేని ఉమ, జీవీ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకుంటామని మంత్రులు చెప్పడం దారుణమని ఈ సందర్భంగా దేవినేని విమర్శించారు. గవర్నర్ బిశ్వభూషణ్‌ తక్షణమే స్పందించి మంత్రుల్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

విశాఖలో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఉన్మాద పరిపాలనపై ప్రజలు పునరాలోచన చేయాలని కోరారు. సీఎం జగన్‌ డమ్మీ కాన్వాయ్ వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపాపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమన్నారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని, కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని