TamilNadu: సీఎంగా స్టాలిన్‌ ప్రమాణస్వీకారం

తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌

Updated : 07 May 2021 10:16 IST

చెన్నై: తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు.

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. 234 స్థానాలకు గాను 133 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే 66, కాంగ్రెస్‌ 18, పీఎంకే 5, భాజపా 4 స్థానాలకే పరిమితమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని