నా భర్త పార్టీ మారితే ఆయన అడుగుజాడల్లో నడవాలి కదా!: మాజీ మంత్రి సుచరిత

‘రాజకీయంగా మా మనుగడ అంటే వైకాపాతోనే అని ఎప్పుడూ చెబుతాం’ అని మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ‘సుచరిత ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందంటే నా భర్త దయాసాగర్‌ కూడా దానికి కట్టుబడి ఉంటారు.

Updated : 05 Jan 2023 10:17 IST

కాకుమాను, న్యూస్‌టుడే: ‘రాజకీయంగా మా మనుగడ అంటే వైకాపాతోనే అని ఎప్పుడూ చెబుతాం’ అని మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ‘సుచరిత ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందంటే నా భర్త దయాసాగర్‌ కూడా దానికి కట్టుబడి ఉంటారు. అలాకాకుండా దయాసాగర్‌ పార్టీ మారతాను. నువ్వు నాతో రా అంటే నేను ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా నేను నా భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా...’ అని ఆమె వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘దయాసాగర్‌ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరు. అందువల్ల జగన్‌మోహన్‌రెడ్డి పార్టీతో మనగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నాం. మేం వైకాపా కుటుంబ సభ్యులం. ఒకే ఇంట్లో ఉండే ఐదుగురిలో కూడా విబేధాలు ఉంటాయి. అంత మాత్రాన వారు వేరని కాదు...’ అని ఆమె పేర్కొన్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు