పోలీసుల సొమ్మును జగన్ ప్రభుత్వం దోచుకుంది
పోలీసులు దాచుకున్న రూ.800 కోట్ల పీఎఫ్ సొమ్మును వైకాపా సర్కారు దోచుకుంటే.. దాని గురించి పట్టించుకోకుండా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెదేపా వాళ్లని తిట్టడమేమిటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు.
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: పోలీసులు దాచుకున్న రూ.800 కోట్ల పీఎఫ్ సొమ్మును వైకాపా సర్కారు దోచుకుంటే.. దాని గురించి పట్టించుకోకుండా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెదేపా వాళ్లని తిట్టడమేమిటని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. పోలీసుశాఖలో ఉన్న కొందరు పై స్థాయి అధికారులు జగన్‌రెడ్డి చెప్పిందల్లా చేస్తూ తప్పుడు నిర్ణయాలతో మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలో 75వేల మంది ఉండాల్సిన పోలీసులు 60వేల మందే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన దాని కంటే తక్కువ పోలీసులున్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గంజాయి, నాటు సారా వ్యాపారాలు, దొంగతనాలు, దోపిడీలు, మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఉన్నవారి మీద పని ఒత్తిడి పెరిగింది. ఇప్పటి వరకూ ఎంత మంది హోంగార్డులను క్రమబద్థీకరించారు? తెలంగాణలో వారికి రూ.30వేల కంటే ఎక్కువ ఇస్తుంటే ఏపీలో రూ.21వేలే ఇస్తున్నారు. ఇవన్నీ పోలీసులను మోసం చేయడం కాదా? వీటి గురించి అసోసియేషన్ ప్రతినిధులు, ఆ శాఖ పెద్దలు మాట్లాడరా’ అని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?