Andhra News: అధికారులపై ప్రజలతో దాడి చేయిస్తా: వైకాపా కౌన్సిలర్ హెచ్చరిక
కౌన్సిలర్లను అగౌరవపరిస్తే అధికారులపై ప్రజలతోనే దాడి చేయిస్తా’ అని ధర్మవరం 4వ వార్డు వైకాపా కౌన్సిలర్ రమణ ఆగ్రహంతో ఊగిపోయారు.
ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే (కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి) చెప్పారు కాబట్టి కౌన్సిల్ సమావేశంలో అధికారులకు గౌరవం ఇస్తున్నా. కౌన్సిలర్లను అగౌరవపరిస్తే అధికారులపై ప్రజలతోనే దాడి చేయిస్తా’ అని ధర్మవరం 4వ వార్డు వైకాపా కౌన్సిలర్ రమణ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన చిందులు తొక్కుతున్నా కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులెవరూ అభ్యంతరం తెలపలేదు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్‌పర్సన్ నిర్మల అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రమణ మాట్లాడుతూ... ‘నా వార్డు ప్రజలు ఇంటి పట్టా సమస్య పరిష్కరించాలని అధికారుల వద్దకు వెళ్తే పట్టించుకోలేదు. పైగా ఎవరికి చెప్పుకొంటారో చెప్పుకోండి అని అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజల చేతనే దాడి చేయిస్తా’ అని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TDP: దమ్ముంటే సభలో జరిగిన ఘటనల వీడియోలను బయటపెట్టాలి: తెదేపా ఎమ్మెల్యేలు
-
Politics News
Chandrababu: జగన్ ప్రోద్బలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు
-
Sports News
MS Dhoni : ధోనీ బటర్ చికెన్ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో బ్రెయిన్‌వాష్.. జార్జియాలో శిక్షణ..!
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!
-
Movies News
Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్