వైకాపా కార్పొరేటర్‌ అనుచిత ప్రవర్తన

మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశంలో వైకాపా కార్పొరేటర్‌ ఉరికిటి నారాయణరావు అనుచితంగా ప్రవర్తించారంటూ జనసేన ఫ్లోర్‌లీడర్‌ వసంతలక్ష్మి కంటతడి పెట్టారు.

Published : 02 Feb 2023 04:48 IST

కంట తడిపెట్టిన జనసేన ఫ్లోర్‌లీడర్‌ వసంతలక్ష్మి

విశాఖపట్నం (కార్పొరేషన్‌), న్యూస్‌టుడే: మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గ సమావేశంలో వైకాపా కార్పొరేటర్‌ ఉరికిటి నారాయణరావు అనుచితంగా ప్రవర్తించారంటూ జనసేన ఫ్లోర్‌లీడర్‌ వసంతలక్ష్మి కంటతడి పెట్టారు. బుధవారం జరిగిన సమావేశంలో విశాఖ ముడసర్లోవలోని 283 ఎకరాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో అభివృద్ధి చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష సభ్యులు మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ఒకవైపు వైకాపా కార్పొరేటర్లు, మరో వైపు ప్రతిపక్ష తెదేపా, జనసేన, సీపీఎం, సీపీఐ, భాజపా కార్పొరేటర్లు మోహరించారు. రెండు పక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా వైకాపా కార్పొరేటర్‌ నారాయణరావు తనపై చేయి చేసుకున్నారని భీశెట్టి వసంతలక్ష్మి వాపోయారు. ఉద్విగ్నతకులోనై కంటతడి పెట్టారు. పలువురు ప్రతిపక్ష, అధికారపక్ష కార్పొరేటర్లు ఆమెను సముదాయించారు. వివాదం ముదరకుండా నారాయణరావును అధికార పార్టీ కార్పొరేటర్లు బయటకు తీసుకెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు