రాజకీయ అస్త్రాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు: కేకే

సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ అస్త్రాలుగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసేందుకే అవి పనిచేస్తున్నాయని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆరోపించారు.

Published : 04 Feb 2023 03:55 IST

ఈనాడు, దిల్లీ: సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ అస్త్రాలుగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేసేందుకే అవి పనిచేస్తున్నాయని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆరోపించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చించాలంటూ పార్లమెంటు ఉభయ సభల్లో భారాస ఎంపీలు శుక్రవారం వాయిదా తీర్మానాల నోటీసులివ్వగా.. సభాపతులు వాటిని తోసిపుచ్చారు. అనంతరం కేశవరావు విలేకరులతో మాట్లాడారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక పేర్కొన్నట్టు అదానీ వ్యవహారాన్ని మించిన పెద్ద కుంభకోణం ఈ శతాబ్దంలోనే లేదన్నారు. అదానీ తీరుతో దేశ ప్రతిష్ఠ మంటగలిసిపోతోందని విమర్శించారు.  భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ అదానీ కంపెనీల అవకతవకలతో పేదలపై పెనుభారం పడుతోందన్నారు. అదానీ అంశంపై ఉభయసభల్లో చర్చ కోరితే కేంద్రం వెనుకడుగు వేస్తోందని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని