కుటుంబ పాలనైతే.. రాష్ట్రం అప్పుల్లో ఎందుకుంది?

రాష్ట్రంలో కుటుంబ పాలనే ఉందని మంత్రి కేటీఆర్‌ శాసనసభలో నిస్సిగ్గుగా మాట్లాడారని వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ధ్వజమెత్తారు.

Published : 06 Feb 2023 03:27 IST

వైతెపా అధ్యక్షురాలు షర్మిల

రంగశాయిపేట(వరంగల్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కుటుంబ పాలనే ఉందని మంత్రి కేటీఆర్‌ శాసనసభలో నిస్సిగ్గుగా మాట్లాడారని వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోగా భారాస ఖాతాల్లో రూ.వేల కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రమంతా కుటుంబమే అని మాట్లాడిన కేటీఆర్‌.. రాష్ట్రం అప్పుల్లో మునిగిపోగా వారి ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్న ముఖ్యమంత్రి కుటుంబం వారి ఆస్తులను మాత్రం పెంచుకుంటోందని ఆరోపించారు. ఆదివారం ఆమె వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లి గ్రామం నుంచి నాలుగో రోజు ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించారు. కేసీఆర్‌ కుటుంబంలో అయిదు ఉద్యోగాలు ఉండగా రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రైతులకు రూ.30 వేల వరకు లబ్ధి చేకూర్చే పథకాలు ఉండగా ప్రసుత పాలకులు వాటిని పక్కన పెట్టి రైతుబంధు పేరుతో రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని