వివేకా హత్య కేసులో త్వరలో మరికొందరికి నోటీసులు

వివేకా హత్య కేసులో త్వరలో మరికొందరికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అరెస్టులు కూడా జరగవచ్చు...’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated : 08 Feb 2023 06:20 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: వివేకా హత్య కేసులో త్వరలో మరికొందరికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అరెస్టులు కూడా జరగవచ్చు...’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏ ముఖ్యమంత్రి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవన్నారు.  2025 వరకు కూడా పోలవరం పూర్తయ్యేలా కనిపించడం లేదన్నారు. అమరావతి, పోలవరాన్ని భ్రష్టు పట్టించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 77 శాతం పూర్తి కాగా... గత నాలుగేళ్లలో ఒకటి, ఒకటిన్నర శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఈ ప్రాజెక్టును బ్యారేజి లాగా మార్చే ప్రయత్నం చేశారని రఘురామ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు