ఉర్దూ తర్జుమాలోకి ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’

వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల కసరత్తుపై దృష్టి సారించిన భాజపా జనాభాపరంగా భారత్‌లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీలను మెప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది.

Published : 24 Mar 2023 04:08 IST

యూపీ మదరసాల్లో పంపిణీకి భాజపా యోచన

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల కసరత్తుపై దృష్టి సారించిన భాజపా జనాభాపరంగా భారత్‌లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీలను మెప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే రేడియో కార్యక్రమం అయిన ‘మన్‌ కీ బాత్‌’ను ఉర్దూలోకి తర్జుమా చేయించి ఆ సంకలనాలను రాష్ట్రంలోని మదరసాలు, ఇస్లామిక్‌ పండితులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2022 ఏడాది మొత్తం జరిగిన ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగాల సంకలనాన్ని రాష్ట్ర భాజపా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కున్వర్‌ బాసిత్‌ అలి ఆధ్వర్యంలో 12 ఎపిసోడ్లుగా మేరఠ్‌కు చెందిన తబిష్‌ ఫరీద్‌ ఉర్దూలోకి అనువదించారు. రంజాన్‌ నెలలో ఈ పుస్తకాన్ని లక్షమంది ప్రజలకు చేరువ చేయడమే తమ లక్ష్యమని బాసిత్‌ అలి తెలిపారు. రాష్ట్రంలోని పాస్మాందా ముస్లింలతో సమావేశాలు ఏర్పాటుచేసి.. పశ్చిమ యూపీలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘వన్‌ కంట్రీ - వన్‌ డీఎన్‌ఏ’ పేరిట స్నేహ్‌ మిలన్‌ సదస్సులను సైతం ఏర్పాటుచేయాలని భాజపా వ్యూహరచన చేస్తోంది.

ఓట్ల కోసం ఉర్దూ జపం : అఖిలేశ్‌ యాదవ్‌

విద్వేషంతో కూడిన విషాన్ని చిమ్మి ముస్లిం సోదరులను అవమానించిన భాజపా ఇపుడు ఓట్ల కోసం ఉర్దూ జపం చేస్తోందని యూపీ మాచ్కీజీజి ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేస్తూ.. భారతీయ భాష ఉర్దూ ప్రేమను నేర్పుతుందని, గంగా - జమునా సంస్కృతిని పెంచుతుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని