Raghu Veera Reddy: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా: మాజీ మంత్రి రఘువీరారెడ్డి

‘శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నా.

Updated : 19 Apr 2023 09:59 IST

కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా

మడకశిర, న్యూస్‌టుడే: ‘శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నా. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా’ అని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి తెలిపారు. మడకశిరలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నా, ప్రధాని మోదీని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఒక్క మాట అన్నందుకే ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం నా మనసును కలచివేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించి ప్రజల ముందుకు వచ్చాను’ అని చెప్పారు. రాహుల్‌ను అవమానించడం వల్లే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కడతారని చెప్పారు. బెంగళూరు నగర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా తనను నియమించారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లి అక్కడి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. తనను అభిమానించేవారు చెప్పినట్లుగా భవిష్యత్తులో నడుచుకుంటానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని