‘ఆపరేటర్‌ ఎత్తే ఫోన్‌కు ‘జగనన్నకు చెబుదాం’ బిల్డప్‌ ఎందుకు?’

కార్పొరేట్‌ కాల్‌సెంటర్‌ తరహాలో ఆపరేటర్‌ ఫోన్‌ ఎత్తి చెప్పే కార్యక్రమానికి జగనన్నకు చెబుదామని బిల్డప్‌ ఎందుకని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు.

Published : 11 May 2023 08:12 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: కార్పొరేట్‌ కాల్‌సెంటర్‌ తరహాలో ఆపరేటర్‌ ఫోన్‌ ఎత్తి చెప్పే కార్యక్రమానికి జగనన్నకు చెబుదామని బిల్డప్‌ ఎందుకని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘జగనన్నకు చెబుదామంటూ ఇప్పుడు ఆర్భాటంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు జగనన్నకు చెప్పిన సమస్యల్లో ఎన్నింటిని పరిష్కరించారు? నాలుగేళ్లనుంచి నిర్వహిస్తున్న స్పందనలో ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేదు’ అని పేర్కొన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట నష్టంపై ప్రభుత్వం చెబుతున్న దానికి భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని