విపక్ష కూటమి సేవలకు 30 మంది ఐఏఎస్‌లా?: తప్పుపట్టిన భాజపా, జేడీ(ఎస్‌)

విపక్షాలు బెంగళూరులో నిర్వహించుకున్న భేటీకి కర్ణాటక ప్రభుత్వం దాదాపు 30 మంది ఐఏఎస్‌ అధికారుల సేవల్ని వినియోగించుకుందని భాజపా, జేడీ(ఎస్‌) ఆక్షేపించాయి.

Published : 19 Jul 2023 09:24 IST

బెంగళూరు: విపక్షాలు బెంగళూరులో నిర్వహించుకున్న భేటీకి కర్ణాటక ప్రభుత్వం దాదాపు 30 మంది ఐఏఎస్‌ అధికారుల సేవల్ని వినియోగించుకుందని భాజపా, జేడీ(ఎస్‌) ఆక్షేపించాయి. ‘ఐఏఎస్‌ల వెట్టిచాకిరీ విధానం’ను రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టినట్లుందని జేడీ(ఎస్‌) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి విమర్శించారు. రాజకీయ నాయకుల సేవకు ఐఏఎస్‌లను ఉపయోగించుకోవడం ‘అఖిల భారత సేవా నిబంధన’లకు పూర్తి విరుద్ధమని చెప్పారు. ఐఏఎస్‌లను రాజకీయ సేవలకు వాడుకోవడం సిగ్గుచేటు అని, రాజకీయ సమావేశం కోసం ప్రభుత్వం ఖర్చుచేయడమేమిటని మరో మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత బసవరాజ్‌ బొమ్మై ప్రశ్నించారు. బెంగళూరులో ఇలాంటి సమావేశాలు జరగడం కొత్త కాకపోయినా ఇంతగా ఖర్చు చేయడం, మాజీ సీఎంల సేవలకూ ఐఏఎస్‌లను వాడడం సిగ్గుచేటు అని విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమో, ప్రమాణ స్వీకారమో కానప్పుడు ఇలా చేయడం కర్ణాటకకు, కన్నడ ప్రజలకు అవమానకరమని అన్నారు. రాష్ట్ర అతిథులకు గౌరవ మర్యాదల్లో భాగంగానే ఐఏఎస్‌లను వినియోగించుకున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ సమర్థించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని