చంద్రబాబు అక్రమ అరెస్టుపై గట్టి పోరాటం చేశారు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును పార్లమెంటులో లేవనెత్తి దేశం దృష్టికి తీసుకెళ్లారంటూ తెదేపా ఎంపీలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అభినందించారు.

Updated : 23 Sep 2023 06:41 IST

ఎంపీలకు లోకేశ్‌ అభినందనలు

ఈనాడు, దిల్లీ: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును పార్లమెంటులో లేవనెత్తి దేశం దృష్టికి తీసుకెళ్లారంటూ తెదేపా ఎంపీలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అభినందించారు. దిల్లీలో తెదేపా ఎంపీలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. వైకాపా ఎంపీల హేళనలు, మాటల దాడులను తట్టుకుని తెదేపా వాణిని సమర్థంగా పార్లమెంటులో వినిపించారని కొనియాడారు. ఈ అంశంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ఎంపీలతో ఆయన చర్చించారు. సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌ పాల్గొన్నారు.

  • చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ను ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల సంచాలకుడు అట్లూరి నారాయణరావు కోరారు. కేంద్ర మంత్రిని శుక్రవారం ఆయన కలిసి విన్నపమిచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని