Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 May 2024 17:00 IST

1. ఓటేసిన వారిని కాటేసే రకం జగన్‌: చంద్రబాబు

ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్‌ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. తెదేపా, భాజపా, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైకాపావి నవరత్నాలు కాదు.. నవమోసాలని విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఓటర్లూ అందుకోండి ఈ ఆఫర్లు..: పోలింగ్‌ను పెంచేందుకు యత్నాలు..!

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే పోలింగ్‌ ముగిసినచోట్ల చప్పగా సాగింది. ఏ దశలోనూ 70శాతం దాటలేదు. దీంతో ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు, స్థానిక అధికారులు, వివిధ ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి సమష్టి యత్నం మొదలుపెట్టారు. ఓటు వేయడాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రత్యేక ఆఫర్లు, కార్యక్రమాలు చేపట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. దలాల్‌ దఢేల్‌: భారీ నష్టాల్లో సూచీలు.. ₹6 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్ల (Stock market) పతనం కొనసాగుతోంది. గురువారం సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. సార్వత్రిక ఎన్నికలు, మెప్పించని క్యూ4 ఫలితాలు వంటి మార్కెట్‌ సెంటిమెంట్‌కు కారణమయ్యాయి. ముఖ్యంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు సూచీలను పడేశాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఎస్‌బీఐ లాభం ₹21,384 కోట్లు.. పీఎన్‌బీ లాభం మూడింతలు

 ప్రభుత్వరంగ బ్యాంకులైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB) మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ.21,384 కోట్లు ఆర్జించగా.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లాభం మూడింతలు పెరిగింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. అబద్ధాలతో గెలవాలని కాంగ్రెస్‌ ప్రయత్నం: అమిత్‌షా

‘రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఏం చెబుతారో దానిని తప్పకుండా చేస్తారని, రాహుల్‌ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఇండియా కూటమి’ విజయం తథ్యం: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. భాజపా, భారస ..తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని చూస్తున్నాయని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్‌.. దాఖలు చేయనున్న ఈడీ

దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలి ఛార్జ్‌షీట్‌ (chargesheet) రూపొందిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. మచిలీపట్నంలో ఇంటింటికీ ‘సిద్ధం’ స్టిక్కర్లు

 కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ప్రచారం పేరుతో ఇంటింటికీ వెళ్లి.. గోడలకు, తలుపులపైన ‘సిద్ధం’ స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ప్రజలకు ఇచ్చే కరపత్రాలకు సైతం ఎన్నికల సంఘం అనుమతి ఉండాలి. కానీ, అవేవీ పట్టించుకోకుండా వైకాపా నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్‌

హరియాణా (Haryana)లో రాజకీయ అస్థిరత కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వానికి ఇటీవల ముగ్గురు స్వతంత్రులు (Independent MLAs) మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. మోదీతో పోరాటం రాహుల్‌గాంధీ వల్ల కాదు: కేటీఆర్

 భాజపా ప్రభుత్వం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ప్రయత్నిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. అలా జరిగితే చిన్న పనుల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందని, అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ నేతలు దిల్లీకి గులామ్‌గిరీ చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు