భారాసకు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు రాజీనామా

భారాస సీనియర్‌ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వేనేపల్లి చందర్‌రావు పార్టీని వీడారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని తన నివాసంలో అనుచరులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 22 Oct 2023 04:05 IST

అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటన

కోదాడ, న్యూస్‌టుడే: భారాస సీనియర్‌ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వేనేపల్లి చందర్‌రావు పార్టీని వీడారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని తన నివాసంలో అనుచరులతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోదాడలో ఎమ్మెల్యే అవినీతి, సొంత పార్టీ నాయకులపైనే కేసులు నమోదు చేయడం, ప్రతి పనిలో కమీషన్లు తీసుకోవడం.. ఇలా అనేక అంశాలతో పార్టీ ప్రభావం తగ్గుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్‌ ఇవ్వొద్దని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోవడంతో.. పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో భారాస రాష్ట్ర కార్యదర్శి వెంకటరత్నం ఎర్నేని, అనంతగిరి జడ్పీటీసీ సభ్యురాలు కొణతం ఉమ, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావు, అనంతగిరి, మోతె ఎంపీపీలు వెంకటేశ్వర్లు, ఆశా; నడిగూడెం జడ్పీటీసీ సభ్యురాలు కవిత, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ మహబూబ్‌జానీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని