KCR: భారాస శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌!

భారాస శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది.

Updated : 09 Dec 2023 08:02 IST

నేడు తీర్మానం చేయనున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు

ఈనాడు, హైదరాబాద్‌: భారాస శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకొని భారాస ప్రతిపక్ష హోదాలో నిలిచింది. పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొని, కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు సమాచారం. అనారోగ్య కారణంగా కేసీఆర్‌ శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని