మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థిగా నవీన్‌కుమార్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు భారాస అభ్యర్థిగా ఎన్‌.నవీన్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు.

Updated : 08 Mar 2024 06:14 IST

ఈనాడు, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు భారాస అభ్యర్థిగా ఎన్‌.నవీన్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం మొదళ్లగూడకు చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి 2014లో అప్పటి పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు నుంచి కాంగ్రెస్‌ తరఫున జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది జడ్పీ వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ టిక్కెట్‌ ఆశించి భంగపడటంతో భారాసలో చేరారు. తాజా ఉపఎన్నికకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేల్లో ఒకరిని బరిలో నిలపాలని పార్టీ భావించినప్పటికీ చివరకు నవీన్‌రెడ్డి పేరు ఖరారైంది. 2021 నవంబరులో పూర్వ మహబూబ్‌నగర్‌లో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ పడింది. అప్పుడు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. ఇందులో గెలిచిన అభ్యర్థి 2028 జనవరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని