Nellore: సార్‌.. ఈ చీరలు మీరిచ్చినవే!

ఇటీవల వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు.. వాలంటీర్లు, విలేకర్లు మొదలు ప్రజలకూ వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు.

Updated : 14 Mar 2024 11:47 IST

న్యూస్‌టుడే, కావలి: ఇటీవల వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు.. వాలంటీర్లు, విలేకర్లు మొదలు ప్రజలకూ వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని వాలంటీర్లకూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆయన అనుచరులు చీరలు ఇచ్చారు. బుధవారం పట్టణంలోని వైకుంఠపురం, పుల్లారెడ్డినగర్‌లో ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాలంటీర్లు ఆ చీరలను ధరించి పాల్గొన్నారు. ఎన్నికల్లో వైకాపా గెలుపునకు పనిచేస్తామని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని