పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికలో అధినేత పవన్‌కల్యాణ్‌దే అంతిమ నిర్ణయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు.

Published : 27 Mar 2024 05:05 IST

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపికలో అధినేత పవన్‌కల్యాణ్‌దే అంతిమ నిర్ణయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన తర్వాతే ఆయన ఒక నిర్ణయానికి వస్తారని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణిస్తాం. ఇలాంటి విషయాలపై పార్టీ క్రమశిక్షణా విభాగం బాధ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని నాగబాబు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని