తేజస్వీ చేప తింటున్న వీడియోపై వివాదం

ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ప్రయాణం చేస్తున్న సమయంలో భోజనంలో భాగంగా చేప తింటూ తీసుకున్న వీడియోపై భాజపా నాయకులు, కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

Published : 11 Apr 2024 06:32 IST

వసంత నవరాత్రి సమయంలో ఇదేమిటన్న భాజపా నాయకులు, కొందరు నెటిజన్లు
ప్రత్యర్థుల తెలివి తక్కువతనాన్ని బయటప్టెటడంలో విజయం సాధించానన్న బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం

పట్నా: ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ ప్రయాణం చేస్తున్న సమయంలో భోజనంలో భాగంగా చేప తింటూ తీసుకున్న వీడియోపై భాజపా నాయకులు, కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. వసంత నవరాత్రి సమయంలో ఇదేమిటని మండిపడ్డారు. తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతన వాదని’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సహా పలువురు భాజపా నేతలు విమర్శించారు. ఆ విమర్శలపై స్పందించిన బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి.. వసంత నవరాత్రికి ముందే చిత్రీకిరించిన వీడియో అదని, తన పేరు చెడగొట్టేందుకు ప్రయత్నించేవారి తెలివితక్కువతనాన్ని బహిర్గతం చేయడంలో విజయం సాధించానని వ్యాఖ్యానించారు. చేపను తింటున్న వీడియోను ఆయనే మంగళవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. బిహార్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్‌లో తాజాగా ప్రవేశించిన వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ముకేశ్‌ సాహ్నీతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణించిన తేజస్వీ.. ఆ సందర్భంగా భోజనం చేయడం కనిపించింది. యాదవులు, సంప్రదాయంగా చేపలు పట్టే వృత్తిలో ఉండే ‘నిషాద్‌’ సామాజికవర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ఇద్దరు నేతలు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని