అమేఠీ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు: రాబర్ట్‌ వాద్రా

అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 05:33 IST

మథుర: అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో చేరాలని అనుకుంటున్నానని, దేశంలో మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో ఉన్న బాంకే బిహారీ స్వామిని వాద్రా సోమవారం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నా లేకపోయినా దేశం, ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు.   అమేఠీలో తాను అభ్యర్థి అవ్వాలా లేదా అనే అంశంపై దేశంలోని ప్రతి మూలనా చర్చ జరుగుతోందని, ఇది ప్రజల కోరికని తెలిపారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను వినాలని, తనకూ రాజకీయాల్లో చేరాలని ఉందని, సరైన సమయంలో నిర్ణయం ఉంటుందని, అంత తొందరేమీ లేదని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని