మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో భాజపా విఫలం

కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి విమర్శించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది.

Published : 17 Apr 2024 04:14 IST

కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి విమర్శించారు. ఆయన అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, తెలంగాణ ఇన్‌ఛార్జి అఖిలేశ్‌ శుక్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వివరించాలన్నారు.  రైతులకు భాజపా పైసా కూడా రుణమాఫీ చేయకుండా పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిందని విమర్శించారు. భాజపాను ఓడించడానికి కిసాన్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించి గ్రామాల్లో రైతులను చైతన్యపరుస్తామని అన్వేశ్‌రెడ్డి తెలిపారు.

పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సేవాదళ్‌ ఇన్‌ఛార్జుల నియామకం

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను నియమించినట్లు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు మిద్దెల జితేందర్‌ తెలిపారు. ఆయన మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఇన్‌ఛార్జులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని