ఆ ముగ్గురికీ అనంతబాబు బినామీ.. ఏ స్థాయిలో సపోర్ట్‌ లేకపోతే చంపేస్తారు?: హర్షకుమార్‌

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌బాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని సీబీఐ విచారణ

Published : 23 May 2022 01:42 IST

అమలాపురం: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌బాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి వ్యవహారంపై హైకోర్టు కలగజేసుకుని సీబీఐ విచారణ ఆదేశించాలని మాజీ ఎంపీ హర్షకుమార్‌ కోరారు. అమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

సీఎం జగన్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్సీ అనంతబాబు బినామీ అని హర్షకుమార్ ఆరోపించారు. అందుకే కళ్లముందే తిరుగుతున్నా అతడిని పట్టుకునేందుకు పోలీసుల సాహసించడం లేదని చెప్పారు.

ఏజెన్సీలో గంజాయి నుంచి గనుల వరకు అక్రమాలన్నీ అనంతబాబు కనుసన్నల్లోనే జరుగుతుంటాయని.. గెస్ట్‌హౌస్‌లు, ఇతర రహస్య ప్రదేశాలు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యానికి తెలుసని చెప్పారు. దీనికి సంబంధించిన విషయాలు అక్కడక్కడా మాట్లాడుతున్నాడనే సుబ్రహ్మణ్యాన్ని చంపేశారని హర్షకుమార్‌ ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీ తీసుకెళ్లి చంపేసి తీసుకొచ్చాడని.. అతడికి ఏ స్థాయిలో మద్దతు లేకపోతే ఇలా చేస్తాడని ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని