Andhra News: వైకాపా నేతల్లా మాది చీకటి బతుకు కాదు: జనసేన నేత శ్రీనివాస్ యాదవ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టేందుకే కొత్తగా మంత్రి పదవులు ఇచ్చారా? అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన
గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టేందుకే కొత్తగా మంత్రి పదవులు ఇచ్చారా? అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇదే మాదిరిగా మాట్లాడిన మంత్రులంతా గొడ్డ చావిడికి పరిమితమయ్యారని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ జీవితం ప్రపంచానికి తెలిసిందేనని.. దీనిలో రహస్యమేమీ లేదన్నారు. వైకాపా నేతల్లా తమది చీకటి బతుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ భూకబ్జాలపై పోరాటం చేస్తామన్నారు. రైతు సమస్యలపై పవన్ మాట్లాడితే కించపరుస్తారా? అని మండిపడ్డారు. వైకాపా మాదిరిగా జనసేన ఓ కులానికి కొమ్ముకాయదని.. నోరు అదుపులో పెట్టుకోకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: రాజశేఖర్ ఇంట్లో మరికొన్ని ప్రశ్నపత్రాలు.. నాలుగో రోజు విచారణలో కీలక ఆధారాలు
-
General News
Ap Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
rangamarthanda review: రివ్యూ: రంగ మార్తాండ
-
Sports News
Sachin - Sehwag: ముల్తాన్ టెస్టులో సిక్స్ కొడతానంటే.. సచిన్ అలా అనేశాడు: సెహ్వాగ్
-
World News
Medvedev: క్షిపణి రావొచ్చు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి: ఐసీసీకి మెద్వదేవ్ వార్నింగ్
-
Movies News
Brahmanandam: చనిపోయే వరకూ కమెడియన్‌గానే ఉంటా: బ్రహ్మానందం