JP Nadda: ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం: జేపీ నడ్డా
ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
శ్రీకాళహస్తి: ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ను బాధ్యతాయుత పాలిటిక్స్ వైపు మళ్లించారని తెలిపారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోదీ మొగ్గు చూపారని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోంది.మోదీ ప్రధాని అయ్యేనాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవి. ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో 50 కోట్ల మందికి కేంద్రం రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఇప్పటికే ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. ఉజ్వల పథకం కింద రూ.9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది.’’ అని జేపీ నడ్డా తెలిపారు.
జగన్ సర్కార్ పాలనను గాలికొదిలేసింది
వైకాపా ప్రభుత్వంపై జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు. ‘‘ ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం. రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడింది. మాకు అవకాశం ఇస్తే రాయలసీమను ప్రగతి పథంవైపు మళ్లిస్తాం.’’ అని నడ్డా అన్నారు.
కేంద్రం పథకాలపై జగన్ ఫొటోలు: సోము వీర్రాజు
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఇచ్చే బియ్యంపై కూడా జగన్ తన ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు. ‘‘ కేంద్రం ఇచ్చే ఇళ్లకు వైకాపా రంగులు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే.. 20 లక్షలు కూడా నిర్మించలేదు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే జగన్ మాత్రం ఆ విషయం చెప్పడం లేదు.’’ అని సోము వీర్రాజు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!
-
Floods: సిక్కింలో మెరుపు వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్