Kerala Cabinet: అందరూ కొత్తవారే

కేరళ నూతన మంత్రివర్గం ఖరారైంది. 11 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్‌ ఏర్పాటు చేశారు.

Published : 19 May 2021 01:24 IST

తిరువనంతపురం: కేరళ నూతన మంత్రివర్గం ఖరారైంది. 11 మందితో నూతన మంత్రివర్గాన్ని సీఎం పినరయి విజయన్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన పేర్లను ప్రకటించారు. గత ప్రభుత్వంలోని ఒక్కరికీ ఈసారి కేబినెట్‌లో అవకాశం కల్పించలేదు. అందర్నీ కొత్తవారినే తీసుకున్నారు. శాసనసభ స్పీకర్‌గా ఎం.బి.రాజేశ్‌, మంత్రులుగా ఎం.వి.గోవిందన్‌, కె.రాధాకృష్ణన్‌, కె.ఎన్‌.బాలగోపాల్‌, పి.రాజీవ్‌, వి.ఎన్‌.వాసన్‌, సౌజీ చెరియన్‌, శివన్‌కుట్టి, మహ్మద్‌ రియాజ్‌, డాక్టర్‌ ఆర్‌.బిందు, వీణా జార్జి, వి. అబ్దుల్‌ రెహ్మాన్‌ ఉన్నారు. 

కొద్దిరోజుల క్రితం వెలువడిన కేరళ శాసనసభ ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కే ప్రజలు మరోసారి పట్టం కట్టారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార ఎల్‌డీఎఫ్‌ 99 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 41 స్థానాలకు పరిమితమైంది. భాజపా బోణీ కొట్టలేకపోయింది. ఉన్న ఒక్కస్థానాన్నీ కోల్పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని