CWC Meeting: కాంగ్రెస్ కీలక భేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం?
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ నేడు జరగనుంది.....
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. దిల్లీలో అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి కీలక నేతలంతా చేరుకున్నారు.
ఈ భేటీలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంజాబ్ పరిణామాలపై ఇటీవల జీ-23గా పేర్కొనే కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్ఠానంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సీడబ్ల్యూసీ భేటీ గురించి పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అధిష్ఠానానికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో సీడబ్ల్యూసీ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఎప్పటి నుంచో పార్టీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలను రాహుల్‌కు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే, కొత్త అధ్యక్షుడి ఎంపికకు మధ్యంతర ఎన్నికలకు బదులు.. పూర్తి స్థాయి సంస్థాగత ఎన్నికలే నిర్వహించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నేటి భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పంజాబ్, యూపీ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఈ సందర్భంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయం
వివేకాను జగన్మోహన్రెడ్డే హత్య చేయించారని, మాకంటే ముందు ఆయనే తిహాడ్ జైలుకు వెళ్లడం ఖాయమని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి అభిప్రాయపడ్డారు. -
బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాంను ప్రజలు మరచిపోలేదు
మంత్రి బొత్స ఫోక్స్ వ్యాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మరచిపోలేదని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. -
తెలంగాణలో ధరణి.. ఏపీలో ల్యాండ్ చట్టం ఒక్కటే
తెలంగాణలో ధరణి చట్టం తీసుకొచ్చిన భారాస ఓడిపోయిందని, ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన జగన్‌కూ పరాభవం తప్పదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. -
పోలింగ్‌కు ముందు పథకాల సొమ్ము జమ చేయాలని కుట్రలు
ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వ పథకాల సొమ్మును జమ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాలని వైకాపా ప్రభుత్వం కుట్రలు చూస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఎవరికివారు నష్టం చేకూర్చుకున్నట్టే
‘ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలు సరైనవి కాకపోతే.. అభివృద్ధి, సంక్షేమం, సాధికారికత ఇవేవీ సాధ్యం కావు. -
జేజేపీలో ముసలం!
హరియాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. భాజపా సర్కారును పడగొట్టాలని చూస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే ఎదురుదెబ్బ తగలబోతున్నట్లు సమాచారం. -
ముగిసిన ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్‌ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం