BJP: డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా?: కిషన్‌రెడ్డి

రానున్న రోజుల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Updated : 12 Aug 2023 17:35 IST

హైదరాబాద్‌: రానున్న రోజుల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం పోరాటం మరింత ఉద్ధృతం చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతోందని, వరదలు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పరామర్శించలేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో కమిషన్ల సర్కారు నడుస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌లో భాజపా మహాధర్నా నిర్వహించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. 

 ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 16, 17 తేదీల్లో ప్రతి ఒక్కరూ బస్తీల సందర్శనకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలన్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు, సెప్టెంబరు 4న హైదరాబాద్‌లో విశ్వరూప ధర్నా ఉంటుందని ప్రకటించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తారా.. గద్దె దిగుతారా? అని ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని