BJP: పెద్దన్న అనగానే కాంగ్రెస్‌.. భాజపా ఒక్కటయినట్లా?: కిషన్‌రెడ్డి

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలు విజయవంతమయ్యాయని కేంద్రమంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 05 Mar 2024 18:53 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలు విజయవంతమయ్యాయని కేంద్రమంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్‌ పెద్దన్న అని ఎందుకు అన్నారో ఆయన్నే అడగాలన్నారు. పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్‌, భాజపా ఒక్కటి అయినట్లా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదని, అవి కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రూ.2లక్షల రుణమాఫీ, 4వేల పింఛనుపై  ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. భాజపా మేనిఫెస్టో కోసం బుధవారం నుంచి సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. అనంతరం పార్లమెంట్‌ ఎన్నికల ఎల్‌ఈడీ ప్రచార రథాలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని