KTR: ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామన్న హామీ ఏమైంది?: కేటీఆర్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని గతంలో భట్టి విక్రమార్క చెప్పారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ గుర్తుచేశారు.

Published : 04 Mar 2024 12:15 IST

హైదరాబాద్‌: ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ హమీ ఏమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు. రద్దు చేస్తామని భట్టి విక్రమార్క గతంలో చెప్పారన్నారు. నో ఎల్‌ఆర్‌ఎస్‌.. నో టీఆర్‌ఎస్‌ అన్నారని గుర్తు చేశారు. భారాస హయాంలో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు కట్టమంటే రక్తమాంసాలు పీలుస్తున్నామని విమర్శించారన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం డబ్బు వసూలు చేస్తోందని ఆరోపించారు. దీని ద్వారా ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు రాబట్టాలని చూస్తోందన్నారు. గతంలో భట్టి చెప్పినవి ఒట్టి మాటలని అర్థమైందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని