KTR: మళ్లీ మోదీని అర్థం చేసుకోలేదని యువతను నిందిస్తారా?: కేటీఆర్‌ ఎద్దేవా

‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో

Updated : 20 Jun 2022 12:57 IST

హైదరాబాద్: ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఈ పథకం విషయంలో వెనక్కి తగ్గేది లేదని రక్షణశాఖ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 

‘‘అగ్నిపథ్‌ పథకం కింద యువత డ్రైవర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, బార్బర్లుగా, వాషర్‌మెన్లుగా ఉపాధి పొందొచ్చని కేంద్ర కేబినెట్‌ మంత్రి చెబుతున్నారు. మరో భాజపా నాయకుడైతే సెక్యూరిటీ గార్డుల నియామకంలో అగ్నివీరులకే తొలి ప్రాధాన్యమంటున్నారు! మళ్లీ మోదీని అర్థం చేసుకోలేదని యువతను మీరు నిందిస్తారా?’’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన  ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని