TDP: త్వరలో తెదేపాలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు

లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో తెదేపాలో చేరనున్నారు.

Updated : 15 Feb 2024 20:12 IST

అమరావతి: నరసరావుపేట ఎంపీ, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో తెదేపాలో చేరనున్నారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరేందుకు ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వందల సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో ఉండవల్లి కరకట్టపై రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని