Nara Lokesh: జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం: నారా లోకేశ్‌

జగన్‌ పాలనలో సీమ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. 

Published : 10 Mar 2024 19:26 IST

రాయదుర్గం: జగన్‌ పాలనలో సీమ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘‘గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా.. రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి చలించిపోయా. ప్రజల కష్టాలను గాలికొదిలేసి.. ల్యాండ్‌, శాండ్‌, వైన్‌, మైన్‌ల పేరుతో ప్రజల రక్తం తాగుతున్న జగన్‌ రాయలసీమ బిడ్డ కాదు.. ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ. ఐదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్‌ ఇరిగేషన్ ద్వారా లక్షలాది మంది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమేకాకుండా.. కరవు సీమలో కార్లపంట పండించిన అపర భగీరథుడు చంద్రన్న. గజ దొంగ కావాలో? విజనరీ లీడర్‌ కావాలో తేల్చుకోవాల్సింది విజ్ఞులైన సీమ ప్రజలే!’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని