Raghurama: 15 రోజుల్లో వివరాలివ్వండి

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది.

Updated : 18 Jun 2021 13:50 IST

కేంద్రహోంశాఖ కార్యదర్శికి లోక్‌సభ స్పీకర్‌ ఆదేశం

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభాహక్కుల నోటీసుపై లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. మే 14న తనని అరెస్ట్‌ చేయడం, ఆ తర్వాత తీవ్రంగా హింసించడంపై స్పీకర్‌ ఓం బిర్లాకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం, డీజీపీ, సీఐడీ ఏడీజీ, సీఐడీ ఎస్పీలపై ఆయన సభాహక్కుల నోటీసు ఇచ్చారు. ఇదే విషయంపై ఆయన కుమారుడు భరత్‌, తెదేపా ఎంపీలు కనమేడల రవీంద్రకుమార్‌, రామ్మోహన్‌నాయుడు కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అన్ని ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్‌ కార్యాలయం.. దీనిపై సమగ్ర వివరాలు అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. 15 రోజుల్లో సమగ్ర వివరాలు పంపాలని నోటీసులు పంపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని