Telangana news: భాజపాకు ఓటు వేసి మోసపోవద్దు.. గోస పడొద్దు: హరీశ్‌రావు

ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ ఆరోగ్యం బాగోలేదన్నారని... ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలానే చేస్తారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Published : 24 Oct 2022 01:27 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఎకరం అమ్మితే కర్ణాటకలో వంద ఎకరాల భూమి వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్లో మర్రిగూడ గ్రామ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజా ఆత్మగౌరవం, రాజగోపాల్‌రెడ్డి ధనదాహం మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. అభివృద్ధిని కాంక్షించే తెరాసకే పట్టం కట్టాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. 

ఎన్నికల తేదీ దగ్గర పడగానే బండి సంజయ్, రఘునందన్, ఈటల రాజేందర్ ఆరోగ్యం బాగోలేదన్నారని... ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అలానే చేస్తారని హరీశ్‌రావు విమర్శించారు. అసలు భాజపా రాజకీయం అలాగే ఉంటుందని... చెయ్యి విరిగిందని ఒకరు, కాలు విరిగిందని మరొకరు, పాపం అనేలా చేసుకుంటారన్నారు. ఇలాంటి జిమ్మిక్కులు నమ్మి మోసపోవద్దని సూచించారు. మునుగోడు నుంచి వలస వచ్చిన వారు సొంత ఊరుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. శివన్నగూడెం చెరువులో నీళ్లు పోయించి ఆ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామన్న హరీశ్‌ రావు... తెలంగాణ పథకాల వల్ల భూమి విలువ ఎంతో పెరిగిందన్నారు. మర్రిగూడ దిక్కు మళ్లి చూడని రాజగోపాల్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. భాజపాకు ఓటు వేసి మోస పోవద్దు... గోస పడొద్దు అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని