MLC Kavitha: ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలి: ఎమ్మెల్సీ కవిత

ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని భారాస ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Published : 16 Dec 2023 21:07 IST

హైదరాబాద్‌: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనమండలి ఆమోదం తెలిపింది. గవర్నర్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్సీ కవిత పలు సవరణలు ప్రతిపాదించారు. తొలి రోజు కావడంతో సవరణలు వెనక్కి తీసుకునేందుకు ఆమె అంగీకరించారు. మండలి సమావేశం ముగిసిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారని తెలిపారు.

‘‘రెండు సార్లు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఏర్పడిన ప్రభుత్వంపై గవర్నర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషించారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని కోరాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. మండలిలో భారాసకు మెజారిటీ ఉంది. ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం. అందుకే మేం ప్రతిపాదించిన సవరణలు వెనక్కి తీసుకున్నాం. ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి. రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్‌ ప్రజలకు వివరించాలి. నష్టం జరిగే చర్యలు అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తాం’’ అని కవిత వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని