Ap News: సీఎం జగన్‌ను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు.

Updated : 10 Jan 2024 16:57 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని.. సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతోపాటు విజయవాడ వైకాపా నేత దేవినేని అవినాష్‌ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత సైతం మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని.. సీఎం జగన్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని