Rahul Gandhi: ‘ మీ కాన్ఫిడెన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌’.. రాహుల్ గాంధీకి భాజపా ఎమ్మెల్యే ప్రశంసలు!

బ్రిటన్‌ పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దిగిన ఫొటోను ప్రశంసిస్తూ భాజపా (BJP) నాయకుడు చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరల్‌గా మారాయి. 

Published : 09 Mar 2023 01:33 IST

దిల్లీ: గత కొద్దిరోజులుగా బ్రిటన్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో రాహల్‌ గాంధీ ఫొటోను భాజపా నాయకుడు ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆయనెవరో కాదు.. ఆసక్తికరమైన పోస్ట్‌లతో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే నాగాలాండ్‌ భాజపా అధ్యక్షుడుతెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్‌ (Temjen Imna Along).

తాజాగా రాహుల్‌ గాంధీ లండన్‌ పర్యటనలో భాగంగా సూట్‌ ధరించి దిగిన ఫొటోను కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్ ఖాతాలో షేర్‌ చేస్తూ..‘‘మీరు ఒంటరిగా ఉన్నారని తెలిసినా.. మీరు నమ్మిన దాని కోసం నిలబడండి’’ అని క్యాప్షన్‌ను జత చేసింది.  దీనిపై తెమ్జెన్‌ స్పందిస్తూ ‘‘ఒప్పుకోవాలి. ఫొటో బాగా వచ్చింది. కాన్ఫిడెన్స్‌, ఫోజ్‌ నెక్ట్స్‌ లెవల్‌’’ అంటూ కామెంట్‌ చేశారు. మరో ట్వీట్‌లో రాహుల్‌ గాంధీ ఫొటో, క్యాప్షన్‌ను షేర్‌ చేస్తూ.. ‘‘కనీసం క్యాప్షన్‌ అన్నా మీరు రాయండి’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో రాహుల్‌ ఫొటోకు ట్యాగ్‌ చేసిన క్యాప్షన్‌ గూగుల్ నుంచి కాపీ చేశారని ఎద్దేవా చేస్తూ తెమ్జెన్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం తెమ్జెన్‌ చేసిన ట్వీట్‌లు సామాజిక మాధ్యమాల్లో (Social Media) వైరల్‌గా మారాయి. మరోవైపు రాహుల్‌ ఫొటో చూసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన్ను కాబోయే పీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బ్రిటన్‌ పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దాన్ని గుర్తించడంలో అమెరికా, యూరఫ్ సైతం విఫలమయ్యాయంటూ ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఆరెస్సెస్‌ను ఫాసిస్ట్‌ సంస్థగా అభివర్ణించారు.  రాహుల్‌ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రమాదంలో ఉన్నది, ప్రజాస్వామ్యం కాదు. కాంగ్రెస్‌ పార్టీ. విదేశీ గడ్డపై భారత్‌ గురించి ఇలాంటి వ్యాఖ్యాలు చేడం సరికాదు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని