Yuvagalam-Nara Lokesh: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో నారా లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. 

Updated : 05 Mar 2023 20:49 IST

పీలేరు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 35వ రోజు ఉత్సాహంగా సాగింది. ఎంజేఆర్‌ కళాశాల అగ్రహారం వద్ద అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. అగ్రహారం వద్ద తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు లోకేశ్‌తో కలిసి నడిచారు. పాదయాత్ర పీలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ దాటాక స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ మార్కెట్‌ సమీపంలో లోకేశ్‌ పాదయాత్రను చూసి కొందరు వైకాపా కార్యకర్తలు జై జగన్‌ అని నినాదాలు చేశారు. ఇది గమనించిన తెదేపా కార్యకర్తలు వారిని తరిమికొట్టారు. దీంతో వారు తప్పించుకొని అక్కడి నుంచి పరారయ్యారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని