Akbar Uddin Owaisi: ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై.. అక్బరుద్దీన్‌ (Akbar Uddin Owaisi)తో ప్రమాణం చేయించారు.

Updated : 09 Dec 2023 14:02 IST

హైదరాబాద్: ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 8.30 గంటలకు గవర్నర్‌ తమిళిసై.. అక్బరుద్దీన్‌ (Akbar Uddin Owaisi)తో ప్రమాణం చేయించారు. సాధారణంగా సీనియర్‌ సభ్యులకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలు నిర్వహించాలని అక్బరుద్దీన్‌ను కోరగా అందుకాయన అంగీకరించారు. ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ వారితో ప్రమాణం చేయిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని