Telangana News: తెలంగాణను అల్లకల్లోలం చేసేందుకు షర్మిల కుట్ర: ఎమ్మెల్సీ పల్లా

వైతెపా అధ్యక్షురాలు షర్మిలకు వైఎస్సార్‌ బిడ్డ అని చెప్పుకొనే అర్హత లేదని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ అన్నారు. వైఎస్‌ఆర్‌ జీవితాంతం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడారని.. అదే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌తో షర్మిల చేతులు కలిపి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

Published : 08 Dec 2022 18:59 IST

హైదరాబాద్‌: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భాజపాతో ఒప్పందం చేసుకొని.. మోదీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ ఆరోపించారు. తెలంగాణను అల్లకల్లోలం చేసేందుకు షర్మిల కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... షర్మిల పాదయాత్రకు భాజపా ప్రజలను సమీకరిస్తోందని ఆరోపించారు.

నర్సంపేట ఘటనను షర్మిల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. షర్మిలకు వైఎస్సార్‌ బిడ్డ అని చెప్పుకొనే అర్హత లేదన్నారు. వైఎస్‌ఆర్‌ జీవితాంతం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడారని.. అదే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌తో షర్మిల చేతులు కలిపి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ పాలనపై ఆమె అడ్డగోలు విమర్శలు చేస్తున్నారన్నారు.  మైనార్టీలు కేసీఆర్‌ పాలనలో సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఎజెండా దేశమంతా అమలు కావాలంటే బీఆర్‌ఎస్‌ రావాలని పల్లా అన్నారు. తెలంగాణలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలని షర్మిల ప్రయత్నించడం సరికాదని స్టీఫెన్‌సన్‌ అన్నారు. తెలంగాణలో శాంతి ఉన్నందునే అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని