మోసపూరిత వైఖరితో ఎంతో మందిని జగన్‌ పొట్టన పెట్టుకున్నారు: పరిటాల సునీత

ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో పోరాడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్‌ను మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు.

Updated : 11 Dec 2023 14:53 IST

అనంతపురం: ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో పోరాడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లేశ్‌ను మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి పరామర్శించారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు.

తొలుత పరిటాల సునీత మాట్లాడుతూ.. మోసపూరిత వైఖరితో అనేకమంది ఉద్యోగ, ఉపాధ్యాయులను సీఎం జగన్‌ పొట్టపెట్టుకున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాద్యాయులకు సక్రమంగా వేతనాలు ఇవ్వలేకపోతోందని విమర్శించారు. చదువు చెప్పాల్సిన టీచర్లను పాఠశాలలో మూత్ర శాలల పరిశీలన విధులు కేటాయిస్తున్నారని ఆక్షేపించారు. టీచర్లను కించపరుస్తున్నారని.. సీపీఎస్‌ రద్దు హామీని నెరవేర్చలేదని మల్లేశ్‌ ఆత్మహత్యకు యత్నించారన్నారు.

పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ తన మోసపూరిత హామీలతో ఉపాధ్యాయులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. తమ హక్కుల సాధనకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తున్నా.. జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీచర్లు ఉద్యమించి ప్రభుత్వం మెడలు వంచాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు