Paritala Sunitha: మరూరు టోల్ గేట్‌ వద్ద జాతీయ రహదారిపై పరిటాల సునీత బైఠాయింపు

పుంగనూరులో తెదేపా శ్రేణులపై రాళ్లదాడిని నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో తెదేపా నాయకులు శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు.

Updated : 05 Aug 2023 13:57 IST

చెన్నెకొత్తపల్లి: పుంగనూరులో తెదేపా శ్రేణులపై రాళ్లదాడిని నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో తెదేపా నాయకులు శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తెదేపా నాయకులపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనలు తెలపటానికి అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు. 

మాజీ మంత్రి పరిటాల సునీత చెన్నెకొత్తపల్లిలో నిరసన తెలపటానికి వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై మరూరు టోల్ గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిరసనలు తెలపటానికి వెళ్తున్నామని సునీత చెప్పినా.. పోలీసులు వినకపోవటంతో ఆమె జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

మరోవైపు హిందూపురంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు రమేశ్‌తో పాటు పలువురు తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిరసనలకు అనుమతించొద్దని.. పైఅధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. ఈక్రమంలోనే పోలీసులు తమను అడ్డుకుంటున్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు