Chandrababu - Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. 

Updated : 08 Jan 2023 13:52 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది.  పవన్‌కు ఎదురెళ్లి గుమ్మం వద్ద చంద్రబాబు స్వాగతం పలికారు. ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల దృష్ట్యా చంద్రబాబుకు పవన్‌ సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక బలోపేతానికి ఐక్య కార్యాచరణ రూపొందించే అంశంపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం. 

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే నిర్ణయించిన నేతలు.. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఓ హోటల్‌లో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌-1పైనా తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ తాజా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని