PM Modi: ‘వికసిత్‌ భారత్‌ కోసం విరాళాలు ఇవ్వండి’.. ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

భాజపాకు విరాళాలు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Published : 03 Mar 2024 18:47 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP)కి విరాళాలు ఇవ్వాలని కోరారు. తనవంతుగా రూ.2 వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌(గతంలో ట్విటర్‌)లో సంబంధిత రశీదును పోస్టు చేశారు. ‘‘వికసిత్‌ భారత నిర్మాణం కోసం జరుగుతోన్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి భాజపాకు విరాళం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. నమో యాప్‌ (Namo APP) ద్వారా మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నా’’ అని ట్వీట్ చేశారు. దానికి ‘డొనేషన్‌ ఫర్‌ నేషన్‌ బిల్డింగ్’ హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు.

10 రోజులు.. 12 రాష్ట్రాలు.. మోదీ సుడిగాలి పర్యటన ఇలా!

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మార్చి 1 నుంచి నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని షేర్‌ చేసిన రశీదు ప్రకారం.. పార్టీకి అందించే విరాళాలకు ఐటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు గత నెలలో తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో నమో యాప్‌ ద్వారా నిధుల సమీకరణ చేపట్టాలని భాజపా నిర్ణయించింది.

ఎన్నికల సంఘం (EC), అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫామ్స్ (ADR)లు వెల్లడించిన వివరాల ప్రకారం ఎన్నికల బాండ్ల రూపంలో భాజపా సుమారు రూ.6,565 కోట్ల విరాళాలు పొందింది. 2022-23 మధ్య కాలంలో ఈ పార్టీకి రూ.2,360 కోట్లు లభించగా.. వాటిలో ఎన్నికల బాండ్ల ద్వారా సుమారు రూ.1,300 కోట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి రూ.452 కోట్లు రాగా.. వాటిలో ఎన్నికల బాండ్ల ద్వారా రూ.171 కోట్లు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని