PM Modi: వారసత్వ నేతలకు భయం పట్టుకుంది: ప్రధాని మోదీ

అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని చెప్పారు.

Updated : 05 Mar 2024 12:53 IST

సంగారెడ్డి: అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని చెప్పారు. సంగారెడ్డిలో భాజపా (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. విదేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. 

‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించాయి. ఆ పార్టీలు ఉన్నచోట ఆయా కుటుంబాలు బాగుపడ్డాయి. దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్‌ ఉందా?
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికీ అన్యాయం జరుగుతోంది. యువతకు అవకాశాలు దొరకడం లేదు. మీ ఆశీర్వాదాలు, నమ్మకాన్ని వృథా కానివ్వను.. ఇది మోదీ గ్యారంటీ. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. ఆ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుతున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. 

మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. రాష్ట్ర యువత కలలను సాకారం చేస్తా. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపాం. కాంగ్రెస్‌, భారాస రెండూ ఒక్కటే. ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలందరికీ అర్థమైంది. కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నారు. తెలంగాణలో భాజపా పట్ల ఆదరణ పెరుగుతోంది. ప్రపంచానికి మనదేశం ఆశాకిరణంగా మారింది. భారత్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దు హామీ అమలు చేశాం. అయోధ్య రామమందిరం నిర్మిస్తామని చెప్పాం.. ప్రపంచం గర్వించే రీతిలో రాముడి ప్రతిష్ఠాపన జరిగింది’’ అని మోదీ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని